
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లోశాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. మసీదు బండలోని లక్సర్ అపార్ట్మెంట్ సెల్లర్ లో ముంపుకు గురైన ప్రాంతాన్ని ,గోడ కూలిన ప్రదేశాన్ని మరియు లహరి అపార్ట్మెంట్ ను డీసీ వెంకన్న గారు మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు.

అనంతరం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ను, హెచ్ ఆర్డిసిఎల్ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన రోడ్డు పై గల ఔట్ లెట్ లను నీటి నిల్వ ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్ సాయిబాబా హెచ్ ఆర్డిసిఎల్ సీఈ వసంత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపు ప్రాంతల్లో పర్యటించి,సహాయక చర్యల పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అసంపూర్తిగా మిగిలి పోయిన రోడ్డు పనులను పూర్తి చేయలని ,ఔట్ లెట్ లను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం లో ముంపు ప్రాంతాల్లో ఎక్కడ సమస్య ఉన్న తక్షణమే అధికారులతో కలిసి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నాల విస్తరణ పనులలో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వెంటనే చేపట్టాలని,త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు EE వెంకటేశ్వర్లు, DE శ్రీనివాస్, మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్,మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు నరేష్, చింత కింది రవీందర్, జగదీష్, మల్లేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.





