కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని పాయింట్ ను కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రంగరావు, రవీందర్ ముదిరాజ్, వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు ఉట్ల కృష్ణ, జంగం గౌడ్, చంద్రమౌళి సాగర్, నరేశ్, విద్యా సాగర్, శ్రీను పాల్గొన్నారు.