మ‌హిళ‌ల సంక్షేమానికి ప్ర‌భుత్వం కృషి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఆల్విన్ కాలనీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ కాలనీలో తెరాస మహిళ నాయకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా మండలి 15వ వార్షికోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగారావుల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహిళ సాధికారికతకు, మహిళల‌ సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంద‌ని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, మహిళల‌ రక్షణ కోసం షిటీమ్ లు ,కేసీఆర్ కిట్, వంటి ఎన్నో సంక్షేమ పథకాల‌ను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, తెరాస నాయకులు మోజేష్, అనిల్ రెడ్డి, పాండు గౌడ్, యాదగిరి, చంద్రమౌళి సాగర్, లక్ష్మీ, మధులత పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here