ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గాంధీచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ ను సత్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని చిన్నారులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, తెరాస డివిజన్ కమీటీల అధ్యక్షులు, డివిజన్ వార్డు సభ్యులు , ఏరియా కమిటీ మెంబర్లు, డివిజన్ తెరాస నాయకులు , నాయకురాళ్ళు, డివిజన్ లోని పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.