మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ ఓంకార్ నగర్ గుడిసె వాసులకు గురువారం భోజనం, పాలు పంపిణీ చేశారు. భారీ వర్షాల కారణంగా గుడిసెల్లోకి వరద నీరు వచ్చి అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో సంకల్ప్ ఫౌండేషన్ చైర్మన్ గుండ్ర రోజి వారికి చేయూతనందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు నిరాశ్రాయులకు, నిరుపేదలకు సహకారం అందించేందుకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. కాగా సంకల్ప్ పౌండేషన్ సేవలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.