శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్, శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తారానగర్ తుల్జా భవాని ఆలయ పాలకమండలి సభ్యులు గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు సంజీవ రెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, సంపత్, గోవింద చారి, రాజు తివారి, రవీందర్ లు అమ్మవారిని వేడుకున్నారు.