వరద‌ భాదితులకు ప్రభుత్వం అండ‌

  • కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడిన బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల‌ మేరకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని వ‌డ్డెర‌ బస్తీ, గుట్టల బేగంపేట, భిక్షపతి నగర్, గోకుల్ ప్లాట్స్ ల‌లోని కుటుంబాలకు రూ.పదివేల‌ చొప్పున ఆర్ధిక సహాయాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందజేస్తుందని తెలియజేశారు. అన్ని వేళలా సహాయక చర్యలు తీసుకోవటానికి తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, బిల్ కలెక్టర్ ఆనంద్, మురళీ కృష్ణ, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాంబశివరావు, శ్రీనివాస్, ప్రసాద్, సాంబయ్య, ఓ.కృష్ణ, వార్డ్ సభ్యులు పితాని లక్ష్మీ శ్రీనివాస్, శ్రీనివాస్, చంటి, దుర్గా రావు, వెంకట్ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here