శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్, లింగంపల్లి, పాపిరెడ్డికాలనీ, సురభి కాలనీ, గోపీనగర్ ప్రాంతాల్లో మంగళవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డివిజన్ పరిధిలో ముంపు బాధితుల ఇళ్లకు తిరుగుతూ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రూ. 10 వేల చొప్పున అధికారులతో కలిసి అందజేశారు.
సహాయం అందుకున్న బాధితులు సీఎం కేసీఆర్ కి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తారానగర్ లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, నట్ రాజ్, బస్తీ కమిటీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్, లింగంపల్లి లో డివిజన్ ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, లింగంపల్లి గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడు పొట్ట మల్లికార్జున యాదవ్, అధ్యక్షుడు రవి యాదవ్, లింగం శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్ ఉన్నారు.
పాపిరెడ్డి కాలనీలో వార్డు మెంబర్ పొడుగు రాంబాబు, డివిజన్ ఉపాధ్యక్షులు కుంచం రమేష్, వేణు, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురభి కాలనీలో వార్డు మెంబర్ శ్రీకళ, కోదండరాం, వెంకట్ రెడ్డి, గోపీనగర్ లో వార్డు మెంబర్ ఫర్వీన్, డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, గోపీనగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, అధ్యక్షుడు ప్రభు గౌడ్, నాయకులు ఆంజనేయులు యాదవ్, నర్సింహా ఉన్నారు.