గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడా పీజేఆర్ కాలనీలో వరద బాధితులకు కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా రూ.10వేల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. వరద బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ సహాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ గిరి, వీఆర్‌వో శ్రీనివాస్ పాల్గొన్నారు.