చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో రెండో రోజు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని గాయత్రి దేవి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శివరామకృష్ణ, లలిత, భార్గవి, కృష్ణప్రసాద్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.