శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): దేశంలో మరెక్కడా చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉంటున్న తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్, కొడిచెర్ల, కర్ణాటక లోని వాడి నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన సుమారు 200 మంది సందయ్యనగర్ కాలనీ తెరాస అధ్యక్షుడు బసవరాజు నేతృత్వంలో హన్మంతు, అంబదాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ లో ఆదివారం చేరారు. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే వ్యక్తి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ లబ్ది పొందుతున్నారని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులమై పని చేయాలన్నారు. వార్డు మెంబర్ శ్రీకళ, సందయ్యనగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, టీఆర్ఎస్ పార్టీ గోపీనగర్ బస్తీ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, మహేందర్, శ్రీకాంత్, కళ్యాణి, సుజాత, రోజా, షఫీ, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఉల్గప్ప, మైసప్ప, దేవప్ప, సంతోష్, తుకారాం, అనిల్, తిరుపతి, ఈరన్న, తిమ్మప్ప, కనకప్ప, బసవరాజు, సునిల్, ఎల్లప్ప బట్కిర్, రాములు, చిన్నమ్మ, లక్ష్మీ, గుండమ్మ, నాగమణి, విజయలక్ష్మీ, బసవమ్మ, ఎల్లమ్మ, అంబిక తదితరులు ఉన్నారు.