గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): శనివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ నగర్, గోపన్ పల్లి డైమండ్ హైట్స్ లో సెల్లార్లలో మళ్లీ వరదనీరు వచ్చి చేరింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్ లతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా అపార్ట్మెంట్ల సెల్లార్లలో చేరిన వరదనీరు రోడ్డు మీదకు రాకుండా స్టార్మ్ వాటర్ డ్రైన్లోకి వదిలేలా చేశారు. ఈ క్రమంలో ఖాజాగూడ రహదారిపై వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. అలాగే డివిజన్ పరిధిలోని సాయి వైభవ్ కాలనీలో కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయిబాబా పర్యటించి కాలనీలో వరదల ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు.