అంగన్ వాడీ ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ అవగాహన కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాపాలన 99 రోజుల కార్యాచ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా అంగన్ వాడీ ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప‌లువురు నాయ‌కులు పాల్గొని మాట్లాడుతూ బాలికలు తల్లికి చెప్పలేని పని చేయకూడదని, అలాగే సెల్ ఫోన్స్ కి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడిక గమనిస్తూ వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సాయికుమార్, వినోద్, మనోజ్ కుమార్, అంగన్ వాడీ టీచర్‌ సురేఖ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here