- – సీఐటీయూ శేరిలింగంపల్లి కార్యదర్శి కృష్ణ ముదిరాజ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులలో పనిచేసే వర్కర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ శేరిలింగంపల్లి కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో డ్రైనేజీ క్లీన్ చేసే జీహెచ్ఎంసీ వర్కర్లు, వాటర్ బోర్డులోని వర్కర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ లు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అయినప్పటికీ అధికారులు వర్కర్లను పనిలోకి తీసుకోవడం లేదన్నారు. అందువల్లే వినతిపత్రాలను అందజేశామని, ఇకనైనా వర్కర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, సిద్దు, వెంకన్న, సురేష్, వంశీకృష్ణ పాల్గొన్నారు.
