శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీకి చెందిన శాంత అనే మహిళకి హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్‌ను పంపిణీ చేశారు. అలాగే ఆమె కుటుంబం ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయినందున ఆమెకు రూ.10వేల సహాయాన్ని గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేదలకు హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన అందరికీ సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకుడు రావూరి సైదేశ్వర్ రావు పాల్గొన్నారు.

