- ఒకే రోజు రూ.17.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపనలు
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పలు ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

కూకట్పల్లిలో…
కూకట్పల్లి డివిజన్ పరిధిలో రూ. 3 కోట్ల 76 లక్షల 85 వేల అంచనా వ్యయంతో పలు ప్రాంతాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. దీనబంధు కాలనీ లో రూ.139.50 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు, హనుమాన్ నగర్ లో రూ.10.35 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల పునరుద్దరణ నిర్మాణ పనులకు, ఆస్బెస్టాస్ కాలనీ లో రూ.200.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే పార్కు అభివృద్ధి పనులకు, పాపిరెడ్డి నగర్ లో రూ.27.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. డీఈ గోవర్ధన్, ఏఈ శివ ప్రకాష్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, హిమగిరి రావు, కార్తీక్ రావు, చంద్ర రెడ్డి, నాగేశ్వర్ రావు, రాంచందర్, ఎల్లం నాయుడు, అబుల్, ఖయ్యుమ్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, కనక రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

వివేకానందనగర్లో…
వివేకానంద నగర్ డివిజన్ లో రూ. 1 కోటి 48 లక్షల 55 వేల అంచనా వ్యయంతో పలు ప్రాంతాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. వివేకానందనగర్ కాలనీ, బాగ్ అమీర్ లలో రూ.91.55 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు, బీటి రోడ్డు నిర్మాణ పనులకు, వెంకటేశ్వర నగర్ లో రూ.57 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. డీఈ శ్రీరాములు, ఏఈ సుభాష్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, రామారావు, కార్తీక్ రావు, రాంచందర్ రావు, అల్లం మహేష్, మురళి, చంద్ర మోహన్, మోహన్ సాగర్, విద్య సాగర్, కుమార స్వామి, యాదగిరి, జగదీశ్ గౌడ్, రమేష్, సత్యనారాయణ, శ్రావణి రెడ్డి, కమలమ్మ, నర్సమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

ఆల్విన్ కాలనీలో…
ఆల్విన్ కాలనీ డివిజన్ లో రూ.5 కోట్ల 88 లక్షల 30 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. ధరణి నగర్, చక్రధరి నగర్, కాకతీయ నగర్ లలో రూ.84.40 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ), వీడీసీసీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, తులసి నగర్ , ఆల్విన్ కాలనీ ఫేజ్ – 2 లో రూ.42.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, సుభాష్ చంద్రబోస్ నగర్ లలో రూ.48.00 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, జన్మభూమి కాలనీ , అంబేద్కర్ నగర్, మహావీర్ నగర్ లలో రూ.72.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రాజీవ్ గాంధీ నగర్ , గణేష్ నగర్ లలో రూ.87.00 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, శిల్ప బృందావనమ్ వద్ద రూ.136.10 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఎన్టీఆర్ నగర్ కమాన్ నుండి పీజేఆర్ నగర్ బస్ స్టాప్ వరకు రూ.51.20 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, జయ నగర్ లో రూ.67.10 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఈ సుభాష్, వర్క్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్, కాశి నాథ్ యాదవ్, బొప్పన మధు, తూము రామారావు, సంతోష్ రావు, శ్రీకాంత్ యాదవ్, రాజేష్ చంద్ర, చిన్నోళ్ల శ్రీను, సంగమేష్, రామకృష్ణ, చంద్ర శేఖర్, శ్రీనివాస్, కుమారి పాల్గొన్నారు.

హైదర్నగర్లో…
హైదర్ నగర్ డివిజన్ లో రూ.6 కోట్ల 11 లక్షల 44 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. లేక్ వ్యూ కాలనీ లో రూ.29.80 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే వీడీసీసీ రోడ్డు, సీసీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు, అడ్డగుట్ట , సమతా నగర్ , భాగ్య నగర్ ఫేజ్ – 2 లో రూ.97.35 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు, హెచ్ఎంటీ హిల్స్ , కృష్ణవేణి నగర్ లో రూ.121.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మిత్ర హిల్స్ , వర్టెక్స్ ప్రివిలేజ్ వద్ద రూ.75.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, రాంనరేష్ నగర్ , సాయి ప్రశాంత్ నగర్ ఫేజ్ – 2 లో రూ.122.19 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అల్లాపూర్ సొసైటీ , బృందవనం కాలనీ , సెవెన్ హిల్స్ లో రూ.110.10 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, హెచ్ఎంటీ శాతవాహన కాలనీ లో రూ.55.10 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ సత్యనారాయణ, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, తెరాస నాయకులు దామోదర్ రెడ్డి, కోనేరు కృష్ణ ప్రసాద్, రావూరి సైదేశ్వర్ రావు, పోతుల రాజేందర్, రంగరాయ ప్రసాద్, కృష్ణముదిరాజ్, వల్లభనేని సుబ్బారావు, అష్రాఫ్, శ్రీహరి, బాలయ్య, కృష్ణ వేణి, పద్మ, విమల, స్వప్న, మాధవి పాల్గొన్నారు.





