శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజవర్గంలోని చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియం రోడ్, విద్యా నర్సింగ్ హోమ్, గజానంద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడి లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ఇందులో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి రూ.3.25 లక్షలకు గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గాలి గిరి, వెంకటేష్, దిలీప్, చరణ్, శివ, గజానంద్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.