శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజపేట్ గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక మహోత్సవాల ఊరేగింపు, నిమజ్జనంలో భాగంగా లడ్డూ వేలం పాటలో విజయలక్ష్మి జువెలర్స్ అధినేత మొలుగు బాల నరసింహ చారి కుమారులు వెంకటేష్ చారి, రవికుమార్ చారి, హరికుమార్ చారి రూ.7.20 లక్షలకు గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో నరసింహాగౌడ్, అనంతరామ్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, ఎం కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జంగిర్ బాబు, వెంకటేష్ గౌడ్, సుదర్శన్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నరేందర్ గౌడ్, సురేందర్ గౌడ్, మ్యాన్న వెంకటేష్, మురళి గౌడ్, దేవేంద్ర ముదిరాజ్, పండు ముదిరాజ్, సాయి యాదవ్, ప్రవీణ్ యాదవ్, సాయి గౌడ్ బాలు తదితరులు పాల్గొన్నారు.