శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో మెడిప్రిక్స్ ఫార్మసీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హోలీస్టిక్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ముఖ్య అథిగా పాల్గొన్నారు. ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమం ఏర్పాటు చేసిన టీపిపిసీ అధికార ప్రతినిది మైదాం బాలకృష్ణ, మెడిప్రిక్స్ ఫార్మసీ యాజమాన్యం, శ్రీ శ్రీ హోలీస్టిక్ హాస్పిటల్ యాజమాన్యన్ని ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజా రాజేశ్వరి నగర్ కాలనీ అధ్యక్షుడు సుద్దపల్లి విజయకృష్ణ, మధు ముదిరాజ్, సంతోష్, రమణ, విశ్వేశ్వర రావు, సతేందర్ సింగ్, అజయ్ సింగ్, కే. శ్రీనివాస్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.






