నమస్తే శేరిలింగంపల్లి: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రస్తుత తెలంగాణలో గుర్తింపు కరువైందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు వాపోయారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ ఉద్యమకారులను ఏకం చేస్తున్న ఉద్యమకారులు శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నివాసం ఉండే లావణ్యను కలిశారు. ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ నాడు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు నేడు ప్రాధాన్యత లేకపోవడం విచారకరమని వాపోయారు. ఉద్యమకారులంతా ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి, రవీందర్ రావు తదితరులు ఉన్నారు.