నమస్తే శేరిలింగంపల్లి: కరోన నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తూ మదినగూడ శ్రీ ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం శివుడుకి ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ కరోనా భూతం ప్రజలను పట్టి పీడిస్తున్న నేపథ్యంలో లకకల్యాణార్థం శివుడికి ఘటాభిషేకం నిర్వహించామని, ప్రజలంతా మృత్యుంజయులుగా మారి కరోనా నుంచి విముక్తులవ్వాలని పరమేశ్వరుడిని ప్రార్ధించామని అన్నారు. ఈ క్రమంలో గర్భగుడి మొత్తం గంగతో నిండిపోయిందని, బుదవారం సాయంత్రం వరకు శివుడు గంగలో శయనిస్తాడని అన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు శివుడుని దర్శించుకుని తరించాలని సూచించారు.






