నమస్తే శేరిలింగంపల్లి: గంగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. భారతీయ జనత పార్టీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం యాదవ్, బిజెపి రాష్ట్ర క్రీడల సెల్ కన్వీనర్ సతీష్ గౌడ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారామ సమేత హనుమంతుడితో పాటు వివిధ దేవతామూర్తులను వారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ హనమంతుడి అనుగ్రహతంతో కరోనా నుంచి ప్రజలంతా శాశ్వతంగా విముక్తులు కావాలని ప్రార్ధించినట్టు తెలిపారు.






