నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి జిహెచ్ఎంసి అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. అనంతరం సిబ్బందితో కలిసి బస్తీలలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం ఐతే తప్ప ఇంటినుండి బయటకి రావద్దని సూచించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే కరోనా మహమ్మరిని జయించగలమన్నారు.






