శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద యూత్ క్లబ్ వ్యవస్థాపకుడు నందనం విష్ణు దత్ ఆధ్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో ఏర్పాటు చేసిన గణేశుని వద్ద వేలంపాటలో 25 కేజీ లడ్డును సినీనటి రోజా భారతి (ఖుషి) రూ.9,99,999కు కైవసం చేసుకున్నారు. అలాగే 5 కేజీల లడ్డును ఫార్మర్స్ పార్క్ అధినేత బీమాన్నగారి ప్రగతి రెడ్డి రూ.. 33,333 కి కైవసం చేసుకున్నారు.






