చందాన‌గ‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభ‌మైన 21వ వార్షిక శివోత్స‌‌వములు

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌లోని విశాఖ‌ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవాని శంకరాల‌య 21 వార్షిక శివోత్స‌వాలు సోమవారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సుద‌ర్శ‌నం స‌త్య‌సాయి బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మొద‌టి రోజు గ‌ణ‌ప‌తి పూజ, పుణ్యాహావాచ‌నం, పంచ‌గ‌వ్య‌ప్ర‌శ‌న‌, అస్త్ర‌రాజార్చ‌న‌, ధీక్షాదార‌ణ‌, మృత్స్య‌గ్ర‌హ‌ణం, అంకురారోప‌ణ‌, అగ్నిప్ర‌తిష్టాప‌న‌, నిత్య‌హోమాలు నిర్వ‌హించారు. సాయంత్రం వృష‌భ‌వాహ‌న సేవలో భాగంగా చందాన‌గ‌ర్ పుర‌వీధుల్లో భ‌వానీశంక‌రులు ఊరేగారు. దారిపొడ‌వునా భ‌క్తులు స్వామివార్ల‌కు స్వాగతం ప‌లుకుతూ ఆశీర్వాదం పొందారు.

భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తున్న భ‌వానీ శంక‌ర స్వామి
వృష‌భ వాహ‌నంపై ఊరేగుతున్న భ‌వానీ శంకరులు, వాహ‌నంపై ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు సుద‌ర్శ‌నం స‌త్య‌సాయి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here