మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సితార గ్రాండ్ హోటల్ సమీపంలోని మురికి కాలువలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నగ్నంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మానవతా దృక్పథంతో సదరు వ్యక్తిని బయటకు తీసి స్నానం చేయించారు. అతనికి కొత్త బట్టలు వేసి ఆహారాన్ని అందించారు. అనంతరం సదరు వ్యక్తిని సంగారెడ్డిలోని మానసిక వికలాంగుల కేంద్రం లైట్ ఆఫ్ ది లైఫ్ కు తరలించి సంరక్షించారు. ఈ సందర్భంగా అతనికి సహాయం అందజేసిన హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుల్‌లు సంజయ్, పాషా లను ఇన్స్‌పెక్టర్ వెంకటేష్ సామల అభినందించారు. మానవతా హృదయంతో మతిస్థిమితం లేని వ్యక్తికి సహాయం చేసిన మియాపూర్ పోలీసులను స్థానికులు ప్రశంసిస్తున్నారు.






