శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని అన్నమాచార్య భావన వాహినిలో వేసవి వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఉచితంగా అన్నమాచార్య సంకీర్తనల గాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి రమణ గోరింట్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి మే 1 వరకు జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు తరగతులను నిర్వహించడం జరుగుతుందని, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభారాజు స్వయంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొనే వారికి వయస్సుతో నిమిత్తం లేదని, సంగీత పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదని, గాత్రం ఎలా ఉన్నా ఎవరైనా కీర్తనలను నేర్చుకోవచ్చని తెలిపారు. 618వ అన్నమయ్య జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఈ తరగతుల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు 9441276825 (రాజేశ్వరి), 9611144002 (పద్మిని), 9550129946 (సౌజన్య), 9966002879 (పరిమళ), 9848024042 (రమణ గోరింట్ల) ఫోన్ నంబర్లలో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.






