శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీలో మైత్రి వాకర్స్ క్లబ్, మైత్రి నగర్ ఫేస్ 2 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K వాకథాన్ కార్యక్రమాన్ని డీసీ శశిరేఖ, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ 5K వాకథాన్ నిర్వహించడం చాలా అభినందనీయం అని అన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన స్పాన్సర్ గంగా లక్ష్మారెడ్డి, మైత్రినగర్ కాలనీ ఫేజ్–II సలహాదారులు చెన్నా రెడ్డి, సుబ్రహ్మణ్యం, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేంద్ర, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






