శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): రాజు శెట్టి కురుమ ఆధ్వర్యంలో మిదాని గ్రూప్స్ సహకారంతో శేరిలింగంపల్లిలోని రాజీవ్ గృహ కల్పలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు శెట్టి కురుమ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రజలు తమ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సగం రోగాలు వాటంతట అవే నయమవుతాయని చెప్పారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు.
తన వంతు సామాజిక బాధ్యతగా శేరిలింగంపల్లిలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు, ఇకపై కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ శిబిరంలో ఉచిత బీపీ, షుగర్, ఈసీజీ , బీఎంఐ టెస్టులతోపాటు వైద్య సలహాలు, మందులు పంపిణీ చేసినట్లు రాజు శెట్టి కురుమ పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం ప్రారంభమైన వైద్య శిబిరం మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగింది.