శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా రోడ్డులో రూ. 4 కోట్ల 31 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే హఫీజ్‌పేట్ ఫ్లై ఓవర్, మంజీరా రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు, RTC కాలనీ నుండి జాతీయ రహదారి వరకు మురళీధర్ అసోసియేషన్ సీసీ రోడ్డు నిర్మాణం పనులకు డీసీ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్, GHMC అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మంజీర రోడ్డు సమస్య కు నేటితో పరిష్కారం లభించిందని అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. నాడు 40 కోట్ల రూపాయలతో మంజీరా మంచి నీటి పైప్ లైన్ ను పునరుద్ధరించామని, పాత పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.