ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

శేరిలింగంపల్లి, మార్చి 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ పార్కులో ఉన్న‌ హెల్త్ కేర్ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ. BMD(ఆర్థో)కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ సలీం (క్లౌ డెంటల్), డాక్టర్ నిసార్, డాక్టర్ విజన్ ఐ కేర్ తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నార‌ని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానము, నడక కనీసం 40 నిమిషాలు చేయాల‌న్నారు.

ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ ఫేర్ నాయకులు సీతారామయ్య, సురేష్, సుమన్ రెడ్డి,మంగపతి, విజయ్ కుమార్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో వృద్ధులు, పిల్లలకు 90 మందికి వైద్యసేవలు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here