ప్రైవేట్ కాలేజీల ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలి: AISF

శేరిలింగంపల్లి, మార్చి 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఇజ్జత్ నగర్‌లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో AISF శేరిలింగంపల్లి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో AISF మండల అధ్యక్షుడు టి.నితీష్, కార్యదర్శి జె.ధర్మతేజ మాట్లాడుతూ మండలంలోని నారాయణ, శ్రీ చైతన్య, మూడులెస, అలిన్ , బన్సల్ , ఆకాష్ , రీజన్స్ , శ్రీ వశిష్ట వంటి కార్పొరేట్ కాలేజీలు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) నిబంధనలను ఉల్లంఘిస్తూ, పదో తరగతి (SSC) పరీక్షలు పూర్తికాకముందే ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నాయని అన్నారు.

ఈ కార్పొరేట్ కాలేజీలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి, విద్యార్థులను బలవంతంగా అడ్మిషన్ల కోసం ప్రేరేపిస్తున్నాయని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే అడ్మిషన్లు చేపట్టడమే కాకుండా, అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని అరికట్టాలని, నిబంధనలను పాటించకుండా వ్యవహరిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో పారదర్శకతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ప్రక్రియ ప్రకారమే అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నితీష్ తోపాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here