శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో చేపట్టవలసిన, పెండింగ్ లో ఉన్న సివరేజ్ పైప్ లైన్ పనులను, అలాగే చేపట్ట వలసిన పలు అభివృధి పనులను జలమండలి సిబ్బంది, జిహెచ్ఎంసి వీధి దీపాల సిబ్బంది, కాలనీ వాసులతో కలసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వారి విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులతో పర్యటించి పాత సివరేజ్ లైన్‌ను మార్చి నూతన సివరేజ్ ను పునర్నిర్మించాలని కోరగా, జలమండలి అధికారులతో కలసి చర్చించి, పరిష్కారం చూపి, పనులను వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు చెప్పారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్ వైజర్ నరేంద్ర, సిబ్బంది, వీధి దీపాల ఇంచార్జి సుధాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






