సమాజ హితం కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలి: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంత్ శ్రీసేవాలాల్ లాంటి మహనీయుణ్ని నిత్యం తలచుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలి అని రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, శ్రీనివాస్ నాయక్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, సూర్య రాథోడ్, అమర్ సింగ్, మునియా నాయక్, సుభాష్ రాథోడ్, గోపాల్, అమర్ సింగ్, సంత్ శ్రీసేవాలాల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here