వేముకుంట బస్తీలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ వేముకుంట బస్తీలో బస్తీ వాసుల ఫిర్యాదు మేరకు సంవత్సర క్రితం ఏర్పాటు చేసిన శిలా ఫ‌లకాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సంవత్సర క్రితం ఏర్పాటు చేసిన శిలాఫ‌లకంలో చెప్పిన‌ పనులు ఇంత వరకు పూర్తి కాలేదని, తిరిగి మళ్ళీ ఇంకో శిలాఫ‌లకం ఏర్పాటు చేశార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె అధికారులకు ఫోన్ చేసి వివ‌ర‌ణ కోర‌గా వారం రోజుల్లో పూర్తి చేస్తాం అని అధికారులు అన్నార‌ని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారులు చెప్పిన‌ట్లు వారం రోజుల్లో ప‌నులు చేప‌ట్టాల‌ని, లేక‌పోతే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ పారునంది, సలీం, గౌస్, కృష్ణ మూర్తి, రాఘవ రావు, విజయ్, సత్యనారాయణ, మొయినుద్దీన్, జవ‌హ‌ర్, ఖ‌లీల్‌, జలీల్, అలీం, రౌఫ్, అబ్దుల్, హైమద్, మోసిన్, మల్లేష్, మజీద్, ఉపేందర్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here