శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సొంత గూటికి చేరనున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందులో భాగంగానే ఆమె కేటీఆర్‌ను కలిశారు. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ లో చేరటానికి అంగీకారం తెలిపారు. నవంబర్ 2 ఆదివారం ఉదయం 11 గంటలకు తన అనుచరులతో కలిసి ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలిపారు. తనతోపాటు భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయటమే ముఖ్య ఉద్దేశమని, శేరిలింగంపల్లిలో చెల్లాచెదురు అయి ఇతర పార్టీలలో చేరిన ఉద్యమకారులు అందరూ సొంత గూటికి చేరాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ని బలోపేతం చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.






