శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా షేక్ పేట్ డివిజన్ పోలింగ్ కేంద్రం పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ లో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఇంటింటికి వెళ్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , షేక్ పేట్ డివిజన్ పోలింగ్ కేంద్రం బీజేపీ అధ్యక్షుడు సాయి కుమార్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు , హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , షేక్ పేట్ డివిజన్ 32వ పోలింగ్ కేంద్రం బీజేపీ నాయకులు కిరణ్ , అశోక్ , నాగరాజు , యాదయ్య పాల్గొన్నారు.






