శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో PM జవహర్ నవోదయ విద్యాలయం రంగారెడ్డి పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఫుట్ బాల్ ఫర్ స్కూల్స్ ఫుట్ బాల్ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ పాల్గుణతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పలు పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు పాఠశాల విద్యార్థులకు ఫుట్ బాల్ లను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్రీడలో ప్రావీణ్యం సాధించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికల పై మంచి ప్రతిభ కనబర్చి, పథకాలు సాధించి, మన ప్రాంతం, రాష్ట్రం, దేశం పేరును ప్రపంచంలో నిలబెట్టేలా విశ్వవిజేతలుగా నిలిచేలా పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం గచ్చిబౌలి ప్రిన్సిపాల్ జితేంద్ర కుమార్, జవహర్ నవోదయ రంగారెడ్డి ప్రిన్సిపాల్ విజయ భాస్కర్, ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీనివాస్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మంత్రిపగడ సత్యనారాయణ, విష్జు వర్ధన్ రెడ్డి, అనిల్, ప్రభాకర్ , వేణు గోపాల్ రెడ్డి , నగేష్, శ్రీశైలం , లక్ష్మణ్, నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






