శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎన్క్లేవ్ కాలనీ నుండి బొల్లారం మెయిన్ రోడ్డు వరకు రూ 1 కోటి 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ.1.50 కోట్ల నిధులతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని, వరద నీటి కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని , రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సునీత, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






