శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా లింగంపల్లి రైతుబజార్ సమీపంలో తెలంగాణ రక్షణ సేన (TRS) జెండాను ఆవిష్కరించారు. వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, వాసిలి నివేదిత, నరేష్, కిషోర్, లావణ్య బండారి, విష్ణు చారి, కవిత, మాధవి, కుమార్ యాదవ్, సందీప్, షేక్ అస్లాం, ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





