శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలలో భాగంగా ఆలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబాని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.