ఎఫ్.సి.ఐ కాలనీలో ఘనంగా మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ 108 కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని డివిజన్ పరిధిలోని ఎఫ్.సీ.ఐ కాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కలిదిండి రోజా కాలనీ వాసులు, జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి చిన్నారులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పార్కులో వారంతా కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సుప్రజ, చంద్రకళ, ఉమకిషన్, గులామ్ ఆలి, సలీమ్, యూనఫ్, యాకూబ్, విక్రమ్, సయ్యద్ అహ్మద్ ఆలీ, సుభాష్, గౌతమ్, వెంకటేష్ కవిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

కాలనీ వాసులతో కలసి మొక్కలు నాటుతున్న కలిదిండి రోజా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here