శిల్ప ఎన్‌క్లేవ్ శ్రీ లక్ష్మీగ‌ణ‌ప‌తి దేవాల‌యంలో ఘనంగా సంక‌ట హ‌ర చ‌తుర్థి

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్ప ఎన్‌క్లేవ్‌లో గ‌ల విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో సంకట హర చతుర్థిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవనకుమార్ శర్మ పర్యవేక్షణలో ఉద‌యం లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం తదితర ప్రత్యేే పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. సాయంత్రం సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కళ్యాణం కన్నుల పండువగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోని తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

భక్తులకు కనువిందు చేస్తున్న శ్రీ లక్ష్మీగణపతి స్వామి
శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here