- శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఘనంగా వేమన జయంతి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకవి యోగి వేమన రెడ్డి జయంతి వేడుకలు చందానగర్‌లోని విక్టరీ బ్యాంకెట్ హాల్లో మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి వేమన రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షంలో తడవని వాడు ఉండడు.. వేమన పద్యం తెలియని వాడు ఉండడని.. అన్నారు. వేమన ఆలోచన శక్తి అద్వితీయమని అన్నారు. వారి ఔన్నత్యాన్ని భావితరాలకు వివరించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని అన్నారు. అందరి మేలు కోరే వర్గం రెడ్డి సామాజిక వర్గమని, అలాంటి రెడ్డిల ఉనికి కోల్పోతుందని నిట్టుర్వాల్సిన పనిలేదని అన్నారు. నిరుపేద రెడ్డిలను ఆదోకోవాల్సిన అవసరం ఉందని, వారికి వ్యక్తిగతంగా ఎలాంటి సహకారమైనా చేసేందుకు సిద్ధమన్నారు. శేరిలింగంపల్లిలో రెండు రెడ్డి సంఘాలు ఉండటం మంచి పరిణామం కాదని, స్థానిక పెద్దలు ముందుకు వస్తే ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను సిద్ధమని అన్నారు. అనంతరం పలువురు పెద్దలు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ఎంపీని కోరారు. రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు.
రెడ్డి కార్పొరేటర్లకు సన్మానం…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రెడ్డి సామాజిక వర్గం కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి (చందానగర్), సింధు ఆదర్శ్ రెడ్డి (భారతీనగర్), గంగాధర్ రెడ్డి (గచ్చిబౌలి) అదేవిధంగా బేస్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డిలను శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఎంపీ రంజిత్‌రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది. సంఘం అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు గున్నాల అనిల్‌రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంఘం ప్రముఖులు కట్ల రఘుపతి రెడ్డి, విశ్వాస్ రెడ్డి, బొబ్బ విజయ్‌రెడ్డి, సునితా ప్రభాకర్‌రెడ్డి, గండిచర్ల జనార్ధన్ రెడ్డి, బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, పోరెడ్డి సంజీవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దుగ్గి రవీందర్ రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, నరాల మహేశ్వర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రాజధర్మారెడ్డి, సత్తిరెడ్డి, బిట్ల శ్రీకాంత్‌రెడ్డి, గంట్ల రాజిరెడ్డి, నాగవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.