గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస‌కే ప‌ట్టం క‌ట్టిన ఎగ్జిట్ పోల్స్

  • తెరాస మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవ‌కాశం
  • బీజేపీ పుంజుకుంటుంద‌ని అంచ‌నా

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా తెరాసకు పట్టం కట్టడం విశేషం. డిసెంబర్‌ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ముగియగా ఓల్డ్‌ మలక్‌పేటలో అభ్యర్థుల గుర్తులను తప్పుగా ముద్రించడంతో గురువారం మళ్లీ అక్కడ పోలింగ్‌ నిర్వహించారు. దీంతో గురువారం సాయంత్రం వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించడంపై నిషేధం విధించారు. ఇక ఓల్డ్‌ మలక్‌పేటలో పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రకటించారు. వాటన్నింటిలోనూ తెరాసకే పట్టం కట్టారు.

నాగన్న సర్వేలో తెరాసకు 95 నుంచి 101 సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీకి 5 నుంచి 12 సీట్లు, ఎంఐఎంకు 35 నుంచి 38, కాంగ్రెస్‌కు 0 నుంచి 1 సీట్‌ వస్తాయని అంచనా వేశారు. అలాగే సీపీఎస్‌ సర్వేలో తెరాసకు 82 నుంచి 96 సీట్లు, బీజేపీకి 12 నుంచి 20 సీట్లు, ఎంఐఎంకు 32 నుంచి 38 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా వేశారు.

పీపుల్‌ పల్స్‌ సర్వే ప్రకారం తెరాసకు 68 నుంచి 78 సీట్లు, బీజేపీకి 25 నుంచి 35 సీట్లు, ఎంఐఎంకు 38 నుంచి 42 సీట్లు, కాంగ్రెస్‌కు 1 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆరా సర్వేలో తెరాసకు 78, బీజేపీకి 28, ఎంఐఎంకు 41, కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఎన్‌ఎఫ్‌వో సర్వేలో తెరాసకు 85 నుంచి 95 సీట్లు, బీజేపీకి 15 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్‌కు 2 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే ఆరా సర్వేలో తెరాసకు 78 సీట్లు వస్తాయని, 40.08 శాతం ఓట్‌ షేర్‌ వస్తుందని అంచనా వేయగా, బీజేపీకి 31.21 శాతం ఓట్‌ షేర్‌, 28 సీట్లు, ఎంఐఎంకు 13.43 ఓట్‌ శాతం, 41 సీట్లు, కాంగ్రెస్‌కు 8.58 ఓట్‌ షేర్‌, 3 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తెరాసకు అనుకూలంగా రావడం విశేషం.

అయితే HYD PULSE స‌ర్వే మాత్రం బీజేపీకి అనుకూలంగా వ‌చ్చింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ 50కి పైగా స్థానాల‌ను సాధిస్తుంద‌ని, తెరాస‌కు 45 నుంచి 50 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఎంఐఎంకు 30కి పైగా స్థానాలు, కాంగ్రెస్ కు 5కు పైగా స్థానాలు, ఇత‌రుల‌కు 1 లేదా 2 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here