మలబార్ గోల్డ్ & డైమండ్స్ లో వ్యాన ప్ర‌త్యేక ర‌త్నాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న‌

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో వ్యాన పేరిట ప్ర‌త్యేక ర‌త్నాభ‌ర‌ణాల ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ మాట్లాడుతూ ఈ ప్ర‌దర్శ‌న‌లో వ‌జ్రాల ఆభ‌ర‌ణాల త‌రుగు చార్జీల‌పై 25 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఏ రెండు రత్నాలు, ఏ ఇద్దరు మహిళలు ఒకేలా ఉండరనే నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యాన మహిళల వ్యక్తిత్వం, వారి అంతర్గత బలం, స్వీయవ్యక్తీకరణకు ఒక ప్రశంసగా నిలుస్తుంద‌న్నారు. వజ్రంతో ప్రేరేపితమైన తేజస్సును, వర్ణరంజితమైన శక్తివంతమైన రత్నాలను, 18, 22 క్యారట్ల బంగారంతో ఎంతో శ్రద్ధగా వ్యానను సుందరంగా రూపొందించార‌ని తెలిపారు. ట్రెండీగా, బోల్డ్‌గా, సులభంగా ధరించగలిగే ఫ్లూయిడ్, తేలికైన సిల్హౌట్‌లు ఈ సేకరణలో ఉన్నాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మోడ‌ల్స్‌, షోరూం సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here