సైబ‌రాబాద్ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్‌లో అంద‌రూ పాల్గొనాలి: సీపీ వీసీ స‌జ్జ‌నార్

సైబ‌రాబాద్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ క్రీడా మైదానంలో సీపీ వీసీ స‌జ్జ‌నార్ ఆదివారం కాసేపు క్రికెట్ ఆడారు. ఈ నెల చివ‌ర్లో జ‌ర‌గ‌నున్న సైబ‌రాబాద్ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2021 కార్య‌క్ర‌మానికి స‌న్నాహ‌కంగా ఆయ‌న క్రికెట్ ఆడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసుల అధికారులు, సిబ్బంది శారీర‌కంగా, మానసికంగా దృఢంగా ఉండాల‌ని అన్నారు. అందుకు గాను నిత్యం ఏదో ఒక క్రీడ‌ను కాసేపు ఆడాల‌ని సూచించారు. సైబ‌రాబాద్ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్‌లో అంద‌రూ పాల్గొనాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌రేట్ కార్యాల‌య పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్రికెట్ ఆడుతున్న సీపీ వీసీ స‌జ్జ‌నార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here