శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజాదేవి రంగారావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెరాస నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వాలను అందజేశారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో భారీగా తెరాస సభ్యత్వాలను నమోదు చేపట్టాలని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, నాయినేని చంద్రకాంత్ రావు, కార్తిక్ రావు, రాంచందర్, హిమగిరి, విజయ్ బాబు, దేవినేని ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వరయ్య, స్థానికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.