శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 2 కోట్ల 74 లక్షల అంచనా వ్యయంతో చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మళ్లింపు పైప్ లైన్ నిర్మాణం పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అభివృద్ధి, సంరక్షణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను త్వరగా పూర్తి చేయాలని, మిగిలి పోయిన పనులను సైతం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.