శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మండల ప్రాథమిక పాఠశాలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో స్కూల్‌ను నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ అభివృద్ధికి కావల్సిన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ రావు, స్కూల్ కమిటీ ఛైర్మన్ బస్వరాజ్, వైస్ ఛైర్ పర్సన్ సుమలత, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, ఆశ్రఫ్, నూతన ఉపాధ్యాయులు పాండురంగారావు, మౌనిక, మాధవి, విజయ, పూజిత, వనిత, స్థానిక వాసులు సారయ్య గౌడ్, యోగి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.